"ఆది పురుష్" టీజర్ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల కొత్త స్ట్రాటజీ తో వచ్చిన మేకర్స్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆదిపురుష్" టీజర్ ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 8 Oct 2022 4:41 PM IST
The Makers of Adipurush Came up With a New Strategy due to the Negative Response to the Teaser
X

"ఆది పురుష్" టీజర్ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల కొత్త స్ట్రాటజీ తో వచ్చిన మేకర్స్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆదిపురుష్" టీజర్ ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ చిత్ర టీజర్ మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ టీజర్ లో ఈ పాత్రలను ఏమాత్రం సరిగ్గా చూపించలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకనిర్మాతలు సినిమాపై బజ్ పెరగడానికి కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను త్రీడీలో విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా 2 డీ మరియు 3 డీ వర్షన్స్ కి మధ్య ఉండే డిఫరెన్సెస్ ను ఇంటర్వ్యూల ద్వారా చెప్తూ సినిమాపై మంచి బజ్ పెంచారని చెప్పచ్చు.

2d కంటే 3d వర్షన్ బాగుందని ఇప్పుడు అభిమానులు సైతం చెప్తున్నారు. మొత్తానికి టీజర్ ని ట్రోల్ చేసిన అదే అభిమానులు ఇప్పుడు సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తమ స్ట్రాటజీతో దర్శక నిర్మాతలు మిగతా సినిమాలకు కూడా ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story