పెద్ద హీరోని తీసుకోవడానికి డబ్బులు లేక రిషి కపూర్ తో సినిమా!

పెద్ద హీరోని తీసుకోవడానికి డబ్బులు లేక రిషి కపూర్ తో సినిమా!
x
Bobby Rishi Kapoor (file image)
Highlights

రిషి కపూర్ రాజ్ కపూర్ తనయుడిగా చాలా చిన్న వయసు నుంచే సినిమాలు చేస్తూ వచ్చారు. చిన్నతనంలోనే అయన తన తండ్రి నటించిన 'శ్రీ420' సినిమాలో మెరిసారు. తరువాత...

రిషి కపూర్ రాజ్ కపూర్ తనయుడిగా చాలా చిన్న వయసు నుంచే సినిమాలు చేస్తూ వచ్చారు. చిన్నతనంలోనే అయన తన తండ్రి నటించిన 'శ్రీ420' సినిమాలో మెరిసారు. తరువాత ఆయన రాజ్ కపూర్ నటించి నిర్మించిన 'మేరా నామ్ జోకర్' సినిమాలో బాల నటుడిగా కనిపించారు. ఆ సినిమాకి ఆయనకు ఉత్తమ బాల నటుడుగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

అప్పులు తీర్చడం కోసం...

ఇక రిషి కపూర్ తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం 'బాబీ'. ఈ సినిమా సూపర్ హిట్. టీనేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో రిషి కపూర్ కు హీరోయిన్ గా డింపుల్ కపాడియా నటించారు. ఈ ఇద్దరి జంట సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది. 1973 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో రికార్డులన్నీ తిరగరాసింది. అప్పట్లో ఈ సినిమా పాటలు.. రిషికపూర్, డింపుల్ కపాడియా రోమాన్స్ అన్నీ మరో లెవెల్ కి సినిమాని తీసుకువెళ్ళాయి.

అయితే, ఈ సినిమాకి మొదట హీరోగా రిషి కపూర్ ను అనుకోలేదట. పైగా రిషి కపూర్ ను హీరోగా సినిమా చేయాలని అప్పటికి రాజ్ కపూర్ కు ఆలోచన లేదట. కానీ, విమర్శకుల ప్రశంశలు అందుకున్న మ్'మేరా నామ్ జోకర్' సినిమా ఆర్ధికంగా రాజ్ కపూర్ కు నష్టాలను మిగిలించిందట. ఆ నష్టాలనుంచి బయట పడటానికి ఓ సినిమా తీయాలని ఆయన భావించారు. అలా 'బాబీ' సినిమా అనుకున్నారు. ఈ సినిమాలో హీరోగా అప్పట్లో యువతరం ఫాలోయింగ్ ఎక్కువ వున్నా రాజేష్ ఖన్నా ను అనుకున్నారట రాజ్ కపూర్. కానీ సినిమా తీయడానికి ఎక్కువ డబ్బు లేక.. రాజేష్ ఖన్నాకు అంత రెమ్యునరేషన్ ఇవ్వలేక ప్రత్యామ్నాయంగా రిషి కపూర్ హీరోగా 'బాబీ' సినిమాని తెరకెక్కించారట. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రాజ్ కపూర్ కు ఆర్ధిక ఇబ్బందులు తొలగి పోయాయి. రిషి కపూర్ హీరోగా బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే నిలబడ్డారు. హీరోయిన్ గా చేసిన డింపుల్ కపాడియా కూడా స్టార్ అయిపోయింది. ఇలా అప్పులు తీర్చడం కోసం 'రాజ్ కపూర్' తీసిన సినిమా అందర్నీ గట్టెక్కించింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రిషి కపూర్ స్వయంగా చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories