ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడని 2020 లోనే చెప్పిన హీరోయిన్

The Heroine Said In 2020 That NTR Will Become A Pan India Star
x

ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడని 2020 లోనే చెప్పిన హీరోయిన్

Highlights

* 2020 లోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని పాయల్ పేర్కొంది.

Payal Ghosh: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మొన్నటిదాకా భారత దేశంలో మాత్రమే దాకా మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఎన్నో దేశాల నుంచి మీడియా కూడా ఎన్టీఆర్ నటన గురించి కథనాలు రాయటం మొదలుపెట్టింది.

ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. దేశ విదేశాల నుంచి కూడా ఎన్టీఆర్ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ వస్తుందని 2020 లోనే హీరోయిన్ పాయల్ ఘోష్ చెప్పింది. ఇప్పుడు ఆమె మాటలు నిజమయ్యాయి. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ నటించిన "ఊసరవెల్లి" సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తమన్నా స్నేహితురాలుగా సినిమా మొత్తం పాయల్ ఘోష్ కూడా కనిపిస్తుంది. కేవలం పాయల్ కోసం మరియు ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు కూడా ఆ సినిమాలో ఉంటాయి.

సినిమా సమయం నుంచి పాయల్ ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయిన ఈ భామ పలుసార్లు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. 2020 లోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని పాయల్ పేర్కొంది. ఇప్పుడు ఆమె మాటలు నిజమయ్యాయి. దీంతో తాజాగా ట్విట్టర్ ద్వారా పాయల్ స్పందిస్తూ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని తాను 2020 లోనే చెప్పినట్లుగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఆమె ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories