స్టార్ హీరోలతో నటించినా ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతున్న హీరోయిన్

The Heroine is Unable to Get Offers to Act With Star Heroes
x

స్టార్ హీరోలతో నటించినా ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతున్న హీరోయిన్ 

Highlights

*మూడు భాషల నుంచి ఆఫర్లు సాధించలేకపోతున్న నాని హీరోయిన్

Priyanka Arul Mohan: "ఓంధ్ కథే హెల్లా" అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన "గ్యాంగ్ లీడర్" సినిమాతో టాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అయితే మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోలేనిప్పటికీ ఆమెకు తెలుగులో బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ శర్వానంద్ సరసన "శ్రీకారం" సినిమాలో నటించిన ప్రియాంక ఆ సినిమాతో డిజాస్టర్ అందుకుంది. దీంతో ఈమెకు ఆఫర్లు మళ్ళీ తగ్గిపోయాయి. అదే సమయంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఈమెకు మంచి ఆఫర్లు రావటం మొదలైంది.

తమిళ్లో శివ కార్తికేయన్ హీరోగా నటించిన "డాక్టర్" సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె ఆ సినిమాతో భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత మళ్ళీ శివ కార్తికేయన్ సరసన "డాన్" సినిమాలో కూడా నటించి మంచి హిట్ ను అందుకుంది. ఈ మధ్యనే స్టార్ హీరో సూర్య సరసన "ఈ టి" సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. హీరోయిన్ గా మారిన మూడేళ్లలోనే ఐదు సినిమాల్లో నటించిన ప్రియాంకకు ఇప్పుడు తమిళ్ నుంచి కూడా ఆఫర్లు సన్నగిల్లాయి. కన్నడ, తెలుగు, తమిళ్ మూడు భాషల్లో సినిమాలు చేసిన ఈమె వరుసగా ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. కానీ దర్శక నిర్మాతల నుంచి మాత్రం ఆమెకు ఎటువంటి ఆఫర్లు రాకపోవటం అభిమానులను సైతం నిరాశ పరుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories