OTT Movie: ఇదో డిఫరెంట్ సినిమా.. చూశారంటే ఇలా కూడా ఉంటుందా అనాల్సిందే..!

The Healer A Unique Hollywood Movie Streaming on OTT Platforms with a Different Storyline
x

OTT Movie: ఇదో డిఫరెంట్ సినిమా.. చూశారంటే ఇలా కూడా ఉంటుందా అనాల్సిందే..!

Highlights

The Healer Movie OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.

The Healer Movie OTT

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అందులో భాగంగా ఓ అద్భుతమైన కథతో తెరకెక్కిన 'ది హీలర్' అనే స్పానిష్ కామెడీ డ్రామా సినిమా ప్రస్తుతం జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోకు కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి. అతడు చేయివేస్తే చాలు ఉన్న రోగాలన్నీ మాయం అవుతాయి. దీంతో తన దగ్గరకు జనాలు క్యూ కడుతుంటారు. 2016లో పాకో అరాంగో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో ఆలివర్ జాక్సన్, కోహెన్, కెమిల్లా లుడింగ్‌టన్, కైట్లిన్ బెర్నార్డ్, జార్జ్ గార్సియా, జోనాథన్ ప్రైస్ నటించారు.

కథలో, హీరో ఒక ఎలక్ట్రిషన్‌గా జీవిస్తూ అప్పులు, ఇంటి అద్దె వంటి బాధలతో ఎదుర్కొంటుంటాడు. బ్యాంకు నుండి అప్పు తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలో అతని చిన్నతండ్రి అతనికి సహాయం చేయడానికి వస్తాడు. తండ్రి చెప్పినట్లు, ఆ ఊరికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం గడపాలనే డిమాండ్ కు హీరో అంగీకరిస్తాడు. ఆ ఊర్లో, హీరో తన తాతల ఫోటోలను చూస్తూ ఆనందించడానికి వెళ్ళినప్పుడు, అక్కడే హీరోయిన్, హీరోకి పరిచయం అవుతుంది. హీరో ఒక ఎలక్ట్రిషన్‌గా పని చేసే ప్రకటన ఇచ్చినప్పుడు, 'హీలర్' అనే పేరుతో రావడంతో పేషంట్లు డాక్టర్ అనుకుని వస్తారు. అయితే, తను డాక్టర్ కాదని చెప్పినా, అతని దగ్గర చేర్చుకున్న పేషంట్లకి రోగాలు నయం అవుతాయి. ఆ క్రమంలో అతన్ని ఆ ప్రాంతంలో దేవుడిగా పిలుస్తారు.

హీరో తన దగ్గర పవర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి, అతని చిన్నతండ్రి అతనికి నిజం చెప్తాడు. ఈ పవర్స్ మన కుటుంబంలో మూడు తరాలకూ ఒకసారి వస్తాయనీ, ఇప్పుడు ఈ పవర్స్ నీకు వచ్చాయనీ చెప్పి, అతనికి ఒక నిర్ణయం తీసుకోవాలని అంటాడు. ఆ సమయానికి, హీరో పవర్స్ వదిలిపెట్టాలనుకుంటాడు. అతని పవర్స్ పోతాయా? హీరో ప్రేమలో పడతాడా? అతను తన అప్పులు తీర్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ‘ది హీలర్’ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories