నాని సినిమా కోసం కళ్యాణ మండపాలు బుక్ చేసిన చిత్ర బృందం

The Film Crew Who Booked The Wedding Halls For The Movie Nani
x

నాని సినిమాకోసం కళ్యాణ మండపాలు బుక్ చేసిన చిత్ర బృందం

Highlights

Nani Movie: 500 మందితో గోదావరిఖని లో నాని

Nani Movie: ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నాని "దసరా" అనే మరొక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరిఖనిలో కొత్త డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో నాని ఒక పూర్తి మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని చిత్ర పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ప్రోమో లో కూడా నాని ఒక మాస్ అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందట. పాట కోసం దాదాపు అయిదు వందల మంది డాన్సర్లు మరియు జూనియర్ ఆర్టిస్ట్ ల అవసరం ఉంది. గోదావరి ఖని వంటి చిన్న టౌన్ లో అంతమందికి స్టే ఇచ్చే హోటల్స్ లేవు కాబట్టి చిత్ర బృందం కొన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు మరియు ప్రైవేట్ హోటల్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దగ్గర్లో ఉన్న కొన్ని కళ్యాణ మండపాలు కూడా చిత్ర బృందం అద్దెకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంత మంది జూనియర్ ఆర్టిస్టులతో పని అంటే బడ్జెట్ పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇక శ్యామ్ సింగరాయి తో నాని మార్కెట్ పెరిగింది కనుక నిర్మాతలు కూడా నాని పై ఎక్కువ బడ్జెట్ పెట్టేందుకు అభ్యంతరాలు చెప్పడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories