Pushpa 2: పుష్ప 2 లో అదిరిపోయేలాగా వచ్చిన ఫైట్ సీన్

The Fight Scene in Pushpa 2
x

Pushpa 2: పుష్ప 2 లో అదిరిపోయేలాగా వచ్చిన ఫైట్ సీన్

Highlights

Pushpa 2: అన్నీ కాస్ట్లీ బట్టలు మాత్రమే వేసుకొనున్న అల్లు అర్జున్

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం "పుష్ప: ది రూల్" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. "పుష్ప 1" సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి అని చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో పుష్ప రెండవ భాగంలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో కూడా అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సమాచారం ప్రకారం ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ ఫైట్ సీన్ షూటింగ్ పూర్తయిందట. ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ ఎవరితో ఫైట్ చేశారో తెలుసుకోవాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా లో మొత్తం అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో బాగా కాస్ట్లీ బట్టలు వేసుకుని కనిపిస్తారట. సినిమాలో బన్నీ చాలా రకాల రిచ్ బట్టల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories