జస్ట్ మిస్.. లేదంటే పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడేది..

The Director Says that it is Better not to Like Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ దాకా రాకపోవడమే మంచిదని అంటున్న అభిమానులు

Highlights

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి కుదరకపోవడమే మంచిది అంటున్న దర్శకుడు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుసగా రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో కొన్నాళ్లపాటు బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ హిందీలో హిట్ అయిన "పింక్" సినిమాకి రీమేక్ అయిన "వకీల్ సాబ్" తో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేకే. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరొక రీమేక్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు చేసి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరోలు ఉన్నారు.

రవితేజ కి బ్రేక్ ఇచ్చిన "ఇడియట్" మరియు మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన "పోకిరి" సినిమాలు ముందుగా పవన్ కళ్యాణ్ కి వచ్చాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నో చెప్పిన మరొక సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. అదే "గాడ్సే". సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట.

కానీ ఆయన డేట్లు కుదరకపోవడంతో కనీసం కథ చెప్పే సాహసం కూడా చేయలేదని వెల్లడించారు డైరెక్టర్. కానీ రవితేజ మరియు మహేష్ బాబు ల విషయంలో జరిగినట్టు సత్యదేవ్ విషయంలో జరగలేదు. "గాడ్సే" సినిమా ఈ మధ్యనే విడుదల అయి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాకా ఈ సినిమా రాకపోవడమే మంచిదైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories