ప్రభాస్ ఎంట్రీ తో అన్ స్టాపబుల్ పై పెరిగిన క్రేజ్

Unstoppable Season 2: ప్రభాస్ ఎంట్రీ అన్ స్టాపబుల్ కి బాగానే వర్క్ అవుట్ అవుతోందా?

Jyothi
Published on: 18 Dec 2022 3:16 PM IST
The Craze on Unstoppable Increased with Prabhas Entry
X

ప్రభాస్ ఎంట్రీ తో అన్ స్టాపబుల్ పై పెరిగిన క్రేజ్ 

Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్సెకండ్ సీజన్ కి తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ ముగ్గురు కలిసి ఎపిసోడ్ సందడిగా ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

ప్రభాస్ చాలా జోవియల్ గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. బాలకృష్ణ తనని కూడా డార్లింగ్ అని పిలవమనగా, ప్రభాస్ డార్లింగ్ సార్ అని అనగా అందరూ నవ్వేశారు. ఇక తన పెద్ద నాన్న కృష్ణంరాజు గురించి కూడా చెప్పి ఎమోషనల్ అయ్యారు ప్రభాస్.

అయితే బాలకృష్ణ రామ్ చరణ్ కి ఒక ఫోన్ కాల్ చేయగా ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ "ఓయ్ చరణు.. నువ్వు నా ఫ్రెండ్ వా లేక శత్రువు వా" అంటూ కామెడీ చేశారు. ఇక ఇదే విషయాన్ని గోపీచంద్ తో చెబుతూ బాలకృష్ణ ప్రభాస్ గురించి రామ్ చరణ్ ఒక లీక్ ఇచ్చాడు అని చెప్పగా గోపీచంద్ రాణి గురించే కదా అని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ ఒక విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది.

నిజానికి అన్ స్టాపబుల్ సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది కానీ సీజన్ 2 కి అంత ఆదరణ లభించలేదు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయాలకు సంబంధించిన గెస్ట్ లు రావడంతో ఈ సీజన్ కు అంతగా క్రేజ్ లభించలేదు. కానీ తాజాగా ఇప్పుడు ప్రభాస్ రాక తో అన్ స్టాపబుల్ పైన ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఎపిసోడ్ కోసం ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story