సమంతతో వల్గర్ స్టెప్స్ వేయించాలి అనుకోలేదు అంటున్న కొరియోగ్రాఫర్

The choreographer says he did not want to fry vulgar steps with Samantha
x

సమంతతో వల్గర్ స్టెప్స్ వేయించాలి అనుకోలేదు అంటున్న కొరియోగ్రాఫర్

Highlights

Choreographer: ఆవిషయం సమంతకి తెలియదట...

Choreographer: అల్లు అర్జున్ నటించిన "పుష్ప" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే? కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ లుగా మారాయి. అయితే సమంత మరియు అల్లు అర్జున్ కలిసి డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ పాట మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ పాట కి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

సినిమా విడుదల కి కొద్ది రోజుల ముందు ఈ పాట షూట్ చేశారని, ఈ పాట కోసం తాను కూడా షూటింగ్ వాయిదా వేసుకున్నారని చెప్పుకొచ్చారు గణేశ్ ఆచార్య. సమంత తన తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారట. నిజానికి ఆ పాట సమయంలో సమంత చాలా నెర్వస్ గా ఉందని అని అన్నారు గణేశ్ ఆచార్య. వల్గర్ డాన్స్ ఆమెతో వేయించాలని అనుకోలేదని, ఆమె యాటిట్యూడ్ తోనే సెన్సువాలిటీని తీసుకురావాలి అనుకున్నామని, అందుకే ఈ పాటకి మంచి ఆదరణ లభించింది అని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క పాట తో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఇప్పుడు తెలుగులో కూడా బోలెడు ఆఫర్లు అందుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories