Raghav Omkar Sasidhar: ఈ విజయం చాలా ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది : ది 100 చిత్ర దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్

Raghav Omkar Sasidhar
x

Raghav Omkar Sasidhar: ఈ విజయం చాలా ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది : ది 100 చిత్ర దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్

Highlights

Raghav Omkar Sasidhar: "ది 100" చిత్రంతో ఇటీవల ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు రాఘవ్ ఓంకార్ శశిధర్.

Raghav Omkar Sasidhar: "ది 100" చిత్రంతో ఇటీవల ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వస్తున్న ఆదరణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ..."ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ.

ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని చూపించాం. థియేటర్లలో సినిమాను చూసి, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆర్కే సాగర్ పోషించిన ఐపిఎస్ ఆఫీసర్ విక్రాంత్‌ క్యారెక్టర్ కు మంచి అప్లాజ్ వస్తుందో మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనా దేవి గారు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. నా తొలి చిత్రానికి ఇంత ప్రోత్సాహం వచ్చినందుకు కృతజ్ఞుడిని. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్‌కే సాగర్‌లకు ధన్యవాదాలు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలనుకుంటున్నాను" అని శశిధర్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories