"కావాలనే క్రికెట్ కి వెళ్ళలేదు," అని షాకింగ్ విషయం బయట పెట్టిన సాయి తేజ్..

Thats why I gave up Cricket, says the Mega Hero
x

"కావాలనే క్రికెట్ కి వెళ్ళలేదు," అని షాకింగ్ విషయం బయట పెట్టిన సాయి తేజ్..

Highlights

Sai Dharam Tej: అందుకే క్రికెట్ వదులుకున్నాను" అంటున్న మెగా హీరో

Sai Dharam Tej: టాలీవుడ్ లో ఉన్న కొందరు యువ హీరోలకి నటన మాత్రమే కాకుండా వేరే టాలెంట్ లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అక్కినేని అఖిల్ యాక్టింగ్ సంగతి పక్కన పెడితే మంచి క్రికెటర్. క్రికెట్ లో చాలా కాలం ట్రైనింగ్ కూడా తీసుకున్న అఖిల్ ఎప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగిన టాలీవుడ్ తరఫున ఆడి టీం ను గెలిపిస్తూనే ఉంటాడు. అఖిల్ తర్వాత క్రికెట్లో వినిపించే మరొక సెలబ్రిటీ పేరు సాయి ధరంతేజ్. ఈ మెగా హీరో కి కూడా సినిమాలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా క్రికెటర్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు.

అయితే సాయి ధరమ్ తేజ్ కి కూడా క్రికెట్లో చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా బయట పెట్టాడు. "క్రికెట్ లో నేను నేషనల్ కి కూడా సెలెక్ట్ అయ్యాను కానీ కావాలనే వెళ్లలేదు," అని చెప్పారు సాయి ధరంతేజ్. సినిమాలపై ఉన్న ప్రేమ కారణంగానే సాయి ధరంతేజ్ క్రికెట్ ని వదులుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బైక్ ఆక్సిడెంట్ తర్వాత ఇప్పుడిప్పుడే పూర్తిగా కోరుకున్న సాయి ధరంతేజ్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "విరూపాక్ష" సినిమా ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో సాయి తేజ్ ఎలాంటి కం బ్యాక్ ఇస్తారో వేచి చూడాలి. ఈ సినిమా కాకుండా తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమాని సాయి ధరంతేజ్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories