అందుకే చిరంజీవి వైజాగ్ హార్బర్ ను ఎంపిక చేయలేదా?

Thats Why Chiranjeevi did Not Choose Vizag Harbour?
x

అందుకే చిరంజీవి వైజాగ్ హార్బర్ ను ఎంపిక చేయలేదా?

Highlights

Chiranjeevi: వైజాగ్ హార్బర్ ఉండగా సెట్ ఎందుకు అని చిరు ని ప్రశ్నిస్తున్న అభిమానులు

Chiranjeevi: వైజాగ్ హార్బర్ లో ఇప్పటికే చాలా తెలుగు సినిమాల షూటింగులు జరిగాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ పాటలు కూడా వైజాగ్ హార్బర్ లోనే చిత్రీకరించబడ్డాయి. ఉదాహరణకు గ్యాంగ్ లీడర్ సినిమాలో టైటిల్ సాంగ్ మరియు బంగారు కోడిపెట్ట పాటల షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.

టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో షూటింగ్ కూడా వైజాగ్ హార్బర్ లో జరుగుతుందని అందరూ అనుకున్నారు. లేదా కనీసం "అల వైకుంఠపురం లో" ఫైట్ సన్నివేశాల షూటింగ్ జరిగిన కాకినాడ పోర్టులో ఒక పాట షూటింగ్ అయిన జరుగుతుందని అనుకున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం చిరంజీవి ఇంట్రడక్షన్ పాట చిత్రీకరణను ఒక స్పెషల్ సెట్ వేయించి అందులో షూట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ వేసిన ఈ సెట్ కు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కానీ వైజాగ్ హార్బర్ ఉండగా చిరంజీవి సెట్ లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే వైజాగ్ హార్బర్ మరియు కాకినాడ పోర్టులో కొన్ని ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని పాట షూటింగ్ కూడా అక్కడే ఎందుకు అని ఆలోచించిన చిత్ర బృందం స్పెషల్ సెట్టును వేసిందని తెలుస్తోంది. ఈ మధ్యనే క్రౌడ్ కి దూరంగా ఉండాలని "సర్కారు వారి పాట" సినిమాలోని ఒక ఫైట్ సన్నివేశాన్ని వైజాగ్ ఆర్కే బీచ్ సెట్ ను హైదరాబాద్ లో వేసి షూటింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ కూడా అలాగే హార్బర్ సెట్ లో జరిగిందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories