Dil Raju: అందుకే నన్ను టార్గెట్‌ చేస్తారేమో..

థియేటర్ల వివాదంపై ఫైనల్ గా నోరు విప్పిన దిల్ రాజు

Arun Chilukuri
Updated on: 16 Dec 2022 4:15 PM IST
That is why They Target me Says Dil Raju
X

Dil Raju: అందుకే నన్ను టార్గెట్‌ చేస్తారేమో..

Dil Raju: మామూలుగా కాంట్రవర్సీలకి దూరంగా ఉండే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న "వారసుడు" సినిమాతో మాత్రం ఎన్నో వివాదాలలో ఇరుక్కుంటున్నారు. పండగ సమయంలో తెలుగు సినిమాలకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అని కామెంట్లు చేసిన అదే దిల్ రాజు ఇప్పుడు విజయ్ "వారసుడు" సినిమాని ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తూ ఎక్కువ థియేటర్లో తీసుకోవటం ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది.

ఒకవైపు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుండగా మరోవైపు దిల్ రాజు మాత్రం "వారసుడు" సినిమా కోసం ఎక్కువ థియేటర్లను తీసుకోవడంపై మిగతా డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు. మొదటి దాకా దిల్ రాజు ఈ వివాదాల గురించి మాట్లాడకుండా మౌనం వహించారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు థియేటర్ల గురించి కామెంట్లు చేశారు.

"మే బీ నేను గ్లామర్ గా ఉంటాను కాబట్టి అందరూ నన్ను టార్గెట్ చేస్తారేమో అనిపిస్తుంది," అంటూ సంబంధం లేకుండా జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు మళ్ళీ దిల్ రాజుని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ కూడా చేస్తున్నారు. ఏదేమైనా దిల్ రాజు వైఖరి మాత్రం అభిమానులను నిరాశ పరుస్తుంది. మరోవైపు రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న వారసుడు సినిమా విజయ్ కి మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కాబోతోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని నిర్మించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story