"ఈ సినిమాతో నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు," అంటున్న దిల్ రాజు

* ఒక సినిమాని ప్రేమించి మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను.

R Tripura Malini
Published on: 25 Nov 2022 7:30 AM IST
that is why i am releasing the movie love today says dil raju
X

"ఈ సినిమాతో నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు," అంటున్న దిల్ రాజు

Dil Raju: ఎటువంటి అంచనాలు లేకుండా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సినిమా "మాసూద". తిరువీర్ మరియు సంగీత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ త్రిల్లర్ లో కావ్య కళ్యాణ్ రామ్ మరియు శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలలో కనిపించారు. సాయికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. "మసూద" సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను డబ్బు మనిషిని కాదని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

"దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని నామీద చాలామంది ఆరోపణలు చేశారు. కానీ నాకు ఇంకొక సైడ్ కూడా ఉంది. అది ఎవరికీ తెలీదు. ఒక సినిమాని ప్రేమించి మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఒక అద్భుతమైన సినిమాని చూపించాలనేదే నా తపన. అందుకే లవ్ టుడే సినిమాని రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు. నేను కేవలం ఈ సినిమాని సినిమాపై ఉన్న ప్యాషన్ తో మాత్రమే రిలీజ్ చేస్తున్నాను. నాకు డబ్బులు వద్దు. డబ్బులతో ఏం చేసుకోగలం?," అని అన్నారు దిల్ రాజు. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా "వారీసు" (తెలుగులో వారసుడు) వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా థియేటర్ల ఇష్యూ గురించి సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుందో క్లారిటీ ఇస్తానని అన్నారు దిల్ రాజు.

R Tripura Malini

R Tripura Malini

Next Story