Thandel OTT Release: ఓటీటీలోకి వచ్చిన తండేల్.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..?

Thandel OTT Release: ఓటీటీలోకి వచ్చిన తండేల్.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే..?
x
Highlights

Thandel OTT Release: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Thandel OTT Release: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుందీ మూవీ. సుమారు రూ. 100 కోట్లకు పైగా రాబట్టి నాగచైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. సాయి పల్లవి, నాగచైతన్యల అద్భుత నటన, చందు దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది.

ఇదిలా ఉంటే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ తాజాగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తండేల్‌ ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. మార్చి 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కథేంటంటే..

శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన రాజు (నాగ చైతన్య), సత్య (సాయి పల్లవి) చిన్ననాటి నుండి కలిసి పెరిగిన మత్స్యకారుల కుటుంబాలకు చెందినవారు. సత్యకు రాజు అంటే ప్రాణం, రాజుకూ సత్యే లోకం. చేపల వేటకు వెళ్లి నెలల తరబడి రాకపోయినా.. రాజు జ్ఞాపకాలతో సత్య జీవిస్తుంది. రాజు చేపల వేటకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుంటుంటే, సత్య అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రాజు తన బాధ్యతను వదులుకోవడం ఇష్టం. సత్య బాధతో మనసును మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది.

అదే సమయంలో రాజు బృందం సముద్రంలో తుఫాన్‌లో చిక్కుకొని, అప్రమత్తమైన పాకిస్తాన్‌ నేవీకి చిక్కుతుంది. ఈ వార్తతో గ్రామం కలత చెందుతుంది, సత్య షాక్‌కు గురవుతుంది. రాజును కాపాడేందుకు సత్య ఏం చేసింది? అతని గతి ఏమైంది? వారి ప్రేమకథ ఎలాంటి ముగింపు పొందింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories