Thammareddy: "ఆర్ ఆర్ఆర్" కాంట్రవర్సీ పై రియాక్ట్ అయిన తమ్మారెడ్డి

Thammareddy Reacts on RRR Controversy
x

Thammareddy: "ఆర్ ఆర్ఆర్" కాంట్రవర్సీ పై రియాక్ట్ అయిన తమ్మారెడ్డి

Highlights

Thammareddy: "వాళ్లు ఎలా ఖర్చు పెట్టుకుంటే నాకెందుకు" అని అంటున్న తమ్మారెడ్డి

Thammareddy: ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ ఫిలిం మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి సంబంధించిన "నాటు నాటు" పాట ఇప్పుడు ఆస్కార్లకు కూడా నామినేట్ అయింది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం మార్చి 12న జరగబోతున్న ఆస్కార్ వేడుకకి కూడా హాజరవబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది రాజమౌళి నే. బాహుబలి సినిమాతోనే ప్రపంచమంతా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన రాజమౌళి "ఆర్ఆర్ఆర్" సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమని ఒకేసారి పది అడుగులు ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సినిమాకి భారీ బడ్జెట్ లు పెట్టారని, ఇక ఆస్కార్ల పని మీద కూడా తిరుగుతూ చిత్ర బృందం దాదాపు 80 కోట్లు ఖర్చు చేసేసారని ఆ 80 కోట్లతో పది చిన్న సినిమాలు తీయచ్చని అన్న సంగతి తెలిసిందే.

దీంతో అభిమానులు అందరూ తమ్మారెడ్డి భరద్వాజ్ పై మండిపడుతున్నారు. చిన్న సినిమాలు తీయొచ్చు కానీ "ఆర్ ఆర్ ఆర్" వంటి గొప్ప సినిమాని తీయలేరని తమ్మారెడ్డిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు తమ్మారెడ్డి. "ఆర్ఆర్ఆర్ సినిమా మీద నేను ఎలాంటి కామెంట్లు చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కడికీ క్లారిటీ ఇస్తాను. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనే కాంటాక్ట్ లో చెప్పాను తప్ప వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటే నాకెందుకు," అని అన్నారు తమ్మారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories