Thaman: తమన్‌ కెరీర్‌ మొదలైంది బాలకృష్ణ మూవీతోనా? రూ. 30ల రెమ్యునరేషన్‌తో

Thaman
x

Thaman: తమన్‌ కెరీర్‌ మొదలైంది బాలకృష్ణ మూవీతోనా? రూ. 30ల రెమ్యునరేషన్‌తో

Highlights

Thaman: సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్‌ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదిరిపోయే సాంగ్స్‌, సూపర్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్నారు తమన్‌.

Thaman: సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్‌ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదిరిపోయే సాంగ్స్‌, సూపర్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్నారు తమన్‌. ప్రస్తుతానికి థమన్ చేతిలో భారీ స్థాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం అందుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్‌ తన మొదటి పారితోషికం గురించి చెప్పిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

థమన్ ఇటీవల యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు సినిమాల్లోకి పరిచయం "భైరవ ద్వీపం" చిత్రంతో జరిగిందని చెప్పారు. అప్పటికి తన వయసు 11 ఏళ్లని, ఆ సినిమా కోసం తొలిసారి పనిచేసినందుకు గాను ఆయనకు రూ.30 పారితోషికంగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై తమన్‌ ఇంకా మాట్లాడుతూ.. "నాకు అప్పట్లో డబ్బులు కిచెన్ బాక్స్‌లో వేసేసినట్టు గుర్తు.. ఒకే ఒక్కరోజు రూ.30, మొత్తం తొమ్మిది రోజుల షూటింగ్‌కు రూ.270 వచ్చాయి" అని థమన్ వివరించారు.

డ్రమ్స్ ప్లేయర్‌గా తన కెరీర్ ఎలా మొదలైందో కూడా థమన్ చెప్పుకొచ్చారు. "నాలుగు ఏళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించటం నేర్చుకున్నాను. బర్త్‌డే పార్టీలకు వెళ్లి పెర్ఫార్మ్ చేసేవాణ్ని. అప్పట్లో 10-25 రూపాయల మధ్యగా ఇచ్చేవారు" అని చెప్పారు. ఇక తన తండ్రి మరణించిన సమయంలో తనపై ఉన్న బాధ్యతతో కంటనీరు కూడా రాలేదని, కానీ శివమణిని చూసిన వెంటనే భావోద్వేగానికి లోనై ఏడ్చానని అన్నారు. బాలు, శివమణి తమ జీవితంలో రెండు కళ్ళలాంటివారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం థమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ‘OG’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ 2’, సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’తో పాటు, తమిళ సినిమా ‘ఇదయం మురళి’కి సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories