Thaman: 20 రోజుల్లో నేపథ్య సంగీతం ఇవ్వనున్న థమన్

S Thaman will compose music for Radhe Shyam movie in 20 days | Movie News
x

20 రోజుల్లో నేపథ్య సంగీతం ఇవ్వనున్న థమన్

Highlights

Thaman: "రాధే శ్యామ్" విషయంలో ఇది ఫిక్స్ అంటున్న థమన్

Thaman: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా నేపథ్య సంగీతం పనులు ఇంకా పూర్తి కాలేదు. దీని కోసమే ఎస్.ఎస్ తమన్ ను రంగంలోకి దింపినట్లు ఈ మధ్యనే చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా సినిమా విడుదలకి 20 రోజులు మాత్రమే టైముంది.

మరి ఈ సమయంలో నేపధ్య సంగీతం పూర్తిచేసి సినిమాని అనుకున్న సమయంలో విడుదల చేయగలరా అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇదే విషయాన్ని అడగగా థమన్ అదిరిపోయే ఇచ్చారు. "సినిమాలో కంటెంట్ అంత బాగున్నప్పుడు, మనం కూడా మన పని పూర్తి చేసి కచ్చితంగా టార్గెట్ ని రీచ్ అవ్వడానికి అని ప్రయత్నాలు చేయాలి. ఇది ఫిక్స్" అంటూ థమన్ ట్వీట్ చేశారు. ఇక 20 రోజుల లోపే థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తానని, ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుంది అని చెప్పకనే చెప్పారు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories