సితార కోసం మహేష్ బాబు ని ఒప్పించిన తమన్

Thaman Convinces Mahesh Babu for Sithara | Telugu Movie News
x

సితార కోసం మహేష్ బాబు ని ఒప్పించిన తమన్

Highlights

*సితార కోసం మహేష్ బాబు ని ఒప్పించిన తమన్

Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో "పెన్నీ" అనే పాట తో మహేష్ బాబు కూతురు సితార వెండితెరపై కనిపించనుంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్ సితార కోసం మహేష్ బాబు ని ఎలా ఒప్పించారు అని అడగగా సితార ఒక రాక్ స్టార్ అని తన బాడీ లోనే మంచి స్వింగ్ ఉందని చెప్పుకొచ్చారు తమన్. "నమ్రత గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను మహేష్ బాబు గారిని కూడా అడిగాను. సితార చేసిన కొన్ని ఇంస్టాగ్రామ్ రీల్స్ మహేష్ బాబు గారికి పంపించి వారిని ఒప్పించాను.

తను షూటింగ్ ని కేవలం మూడు గంటల్లో పూర్తి చేసింది" అని చెప్పుకొచ్చారు తమన్. ఇక ఈ సినిమాలోని కళావతి పాట కూడా చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పాట పాడిన సింగర్ శ్రీరామ్ ఇంతకుముందు చాలా పాడిన పాటలు పాడినప్పటికీ ఈ పాటలో తన వాయిస్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుందని అన్నారు తమన్. అలాగే ఈ సినిమా టైటిల్ సాంగ్ చేయటం చాలా కష్టంగా అనిపించింది అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories