Thama Movie: హారర్‌ లోకంలోకి అడుగుపెడుతున్న రష్మిక!

Thama Movie: హారర్‌ లోకంలోకి అడుగుపెడుతున్న రష్మిక!
x

Thama Movie: హారర్‌ లోకంలోకి అడుగుపెడుతున్న రష్మిక!

Highlights

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మరో కొత్త జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ఆమె నటిస్తున్న హారర్ థ్రిల్లర్‌ ‘థామా’ (Thama) చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మరో కొత్త జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ఆమె నటిస్తున్న హారర్ థ్రిల్లర్‌ ‘థామా’ (Thama) చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అదే సమయంలో ప్రధాన పాత్రల పేర్లు, వారి లుక్స్‌ను పరిచయం చేస్తూ పోస్టర్లు కూడా విడుదల చేసింది.

మ్యాడ్‌డాక్‌ సూపర్‌నేచురల్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ వంటి హారర్‌ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ‘థామా’ మాత్రం వాటికంటే పూర్తి భిన్నంగా రొమాంటిక్ హారర్‌గా రూపొందుతోంది. ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రేమే ప్రధాన సూత్రధారమని బాలీవుడ్ టాక్‌. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ‘అలోక్‌’గా, రష్మిక ‘తడకా’గా కనిపించనున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ‘యక్షసాన్‌’గా, పరేశ్‌ రావల్‌ ‘రామ్ బజాజ్ గోయెల్‌’ పాత్రలో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories