Thalapathy Vijay - Vamshi Paidipally: ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో వంశీ రెడీ

Thalapathy Vijay Joining Hands With Hit Director Vamshi Paidipally for his New Movie
x

వంశీ, విజయ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Vijay - Vamshi Paidipally: స్క్రిప్ట్‌రైటర్‌గా మారిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇటీవల అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' సినిమా చేశాడు.

Thalapathy Vijay - Vamshi Paidipally: స్క్రిప్ట్‌రైటర్‌గా మారిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య.. నా ఇలు ఇండియా' సినిమాకు డైరెక్టర్‌ వహించారు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

అయితే ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ విజయ్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యపరిచాడు వంశీ పైడిపల్లి. దీంతో విజయ్ తొలిసారిగా డైరెక్ట్ తెలుగు సినమా చేయనున్నాడు. వంశీ స్వయంగా ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం, వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అన్ని వాణిజ్య అంశాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

దిల్ రాజు తన యూఎస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక స్క్రిప్ట్ వింటాడని తెలుస్తోంది. మరోవైపు, విజయ్ తన రాబోయే సినిమా #Thalapathi65తో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించే ఈప్రాజెక్టు పూర్తికాగానే, వంశీతో సినిమా చేయనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories