
Trisha
Trisha: ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలిచినా, నేను నీకు అండగా ఉంటాను.. త్రిష సంచలన ట్విట్
Trisha: తమిళ చలనచిత్ర పరిశ్రమలో ‘దళపతి’ విజయ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై రికార్డులు తిరగరాసే ఈ స్టార్ హీరో, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న తుపానుతో వార్తల్లో నిలిచారు. విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్థలు వచ్చి, వ్యవహారం చంగల్పట్టు కోర్టు మెట్లెక్కిందనే వార్త కోలీవుడ్‌లో దావాగ్నంలా వ్యాపించింది. అయితే, ఈ వివాదానికి కేంద్ర బిందువుగా స్టార్ హీరోయిన్ త్రిష పేరు వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్.
విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, త్రిష గతంలో చేసి డిలీట్ చేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతికి చిక్కింది. గతంలో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ను విమర్శిస్తూ త్రిష పేరును లాగడంతో ఆమె తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే త్రిష ఒక ట్వీట్ చేస్తూ.. "ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచినా, నేను నీకు అండగా ఉంటాను.. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను" అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. అప్పట్లో ఆ పోస్ట్ విజయ్‌పై ఆమెకున్న స్నేహపూర్వక గౌరవంగా భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది విజయ్‌కి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ ట్వీట్‌ను త్రిష వెంటనే డిలీట్ చేసినా, నెటిజన్లు తీసిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఆయన ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఈ పాత ట్వీట్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? త్రిష ఎందుకు అంత ఎమోషనల్ అయ్యింది? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు విడాకుల వార్తలు, మరోవైపు త్రిషతో అనుబంధంపై వస్తున్న పుకార్లు విజయ్ దళపతిని ఇరకాటంలో పడేస్తున్నాయి.
Trisha: విజయ్ అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. విజయ్ క్లీన్ ఇమేజ్ను చెడగొట్టడానికి కొందరు కావాలనే పాత విషయాలను బయటకు తీస్తున్నారని మండిపడుతున్నారు. అయితే, త్రిష ఆ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేసింది? అది నిజంగా విజయ్ కోసమే పెట్టిందా? లేక రాజకీయ విమర్శలకు కౌంటరా? అన్నది ఇప్పటికీ సస్పెన్సే. మొత్తానికి, వెండితెరపై ‘గిల్లీ’, ‘కురువి’, ‘లియో’ వంటి చిత్రాలతో మెప్పించిన ఈ జోడీ, ఇప్పుడు నిజ జీవితంలోని వివాదాల కారణంగా చర్చనీయాంశమైంది. కోర్టులో విడాకుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, ఈ ట్వీట్ సెగ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




