OTT Movie: ఈ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. అమెజాన్‌లో అదిరిపోయే సైకో కిల్ల‌ర్ మూవీ..!

Terrifier OTT Movie A Brutal Psycho Killers Story Streaming on Amazon Prime
x

OTT Movie: ఈ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. అమెజాన్‌లో అదిరిపోయే సైకో కిల్ల‌ర్ మూవీ..!

Highlights

OTT Movie: సైకో హంతకుల గురించి సినిమాలు ఎన్నో చూశాం. అయితే, కొన్ని పాత్రలు చేసే హత్యలు ఎంత క్రూరంగా ఉంటాయంటే, అవి నిజంగానే నరకాన్ని తలపిస్తాయి.

OTT Movie: సైకో హంతకుల గురించి సినిమాలు ఎన్నో చూశాం. అయితే, కొన్ని పాత్రలు చేసే హత్యలు ఎంత క్రూరంగా ఉంటాయంటే, అవి నిజంగానే నరకాన్ని తలపిస్తాయి. అలాంటి భయంకరమైన సీన్‌లతో ప్రేక్షకులను భయపెట్టే సినిమాల‌కు క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ విస్తృతి పెరిగిన త‌ర్వాత ఇలాంటి వాటికి ఆద‌ర‌ణ ఎక్కువుతోంది. అమెజాన్ వేదిక‌గా అందుబాటులో ఉన్న అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సైకో థ్రిల్ల‌ర్ మూవీల‌ను ఇష్ట‌ప‌డేవారికి ‘టెర్రిఫైయర్ (Terrifier)’ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చారు. ఒక రాత్రి చుట్టూ తిరిగే ఈ క‌థ వెన్నులో వ‌ణుకు పుట్టించ‌డం ఖాయం. 2016లో విడుదలైన ఈ అమెరికన్ హారర్ స్లాషర్ మూవీకి డామియన్ లియోన్ దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నా కానెల్, సమంతా స్కాఫిడి, డేవిడ్ హోవార్డ్ థోర్న్టన్, కేథరిన్ కొర్కొరన్ కీలక పాత్రల్లో న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఈ సినిమా క‌థేంటంటే.?

ఒక టీవీ టాక్ షోలో మోనికా బ్రౌన్ అనే మహిళ హోస్ట్‌గా పనిచేస్తుంది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది హాలోవీన్ నాడు జరిగిన దారుణ ఘటన గురించి ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆమె ముఖంపై గాయాలు ఉంటాయి. ఆర్ట్ ది క్లౌన్ అనే దుర్మార్గ హంతకుడు తనను గాయపరిచాడని వివ‌రిస్తుంది. అయితే ఆర్ట్ ది క్లౌన్ అప్పటికే చనిపోయినట్టే కాని, మృతదేహం మార్చురీ నుంచి మాయమైపోవడంతో అతను ఇంకా బతికే ఉంటాడని అనుమానాలు మొదలవుతాయి.

ఇంట‌ర్వ్యూ ముగిసిన వెంట‌నే మోనికా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో ఆ మహిళ రూపాన్ని గేలిచేస్తూ మాట్లాడుతుంది. కానీ అదే సమయంలో ఆ మహిళ మోనికాపై క్రూరంగా దాడి చేస్తుంది. క‌థ ఒక ఏడాది వెన‌క్కి వెళ్తుంది. 2017 హాలోవీన్ రాత్రి తారా, డాన్ అనే ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ద్యం మ‌త్తులో ఒక కేఫ్ కు వెళతారు. అక్కడ వారు ఆర్ట్ ది క్లౌన్ ను కలుస్తారు.

ఆ స‌మ‌యంలో జ‌రిగిన గొడ‌వ‌లో బాత్రూం ధ్వంసం అవుతుంది. ఆర్ట్ అలా చేసినందుకు రెస్టారెంట్ యజమాని అతన్ని బయటకు గెంటేస్తాడు. తారా , డాన్ బయటకు వెళ్లినప్పుడు కారు టైర్లు పంక్చర్ అయినట్లు డాన్ గుర్తిస్తాడు. దీనినే ఆస‌ర‌గా చేసుకొని తన బ్యాగ్‌లో ఉన్న ఆయధాల‌తో తారా, డాన్ ను క్రూరంగా హత్య చేస్తాడు. అలాగే మ‌రికొంద‌రిని ఇలాగే క్రూరంగా హ‌త్య చేస్తాడు. ముఖ్యంగా మహిళలపై అతని దాడులు అత్యంత క్రూరంగా ఉంటాయి. ఆతరువాత ఆర్ట్ విక్టోరియాపై కూడా దాడి చేసి, ఆమె ముఖాన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. చివరికి విక్టోరియా మోనికా పై దాడి ఎందుకు చేస్తుంది ? ఆర్ట్ ను పోలీసులు పట్టుకుంటారా ? అతను ఇంకా ఎన్ని హత్యలు చేస్తాడు. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories