Top
logo

టెర్మినేటర్: డార్క్ ఫేట్ తెలుగు ట్రైలర్ విడుదల

టెర్మినేటర్: డార్క్ ఫేట్  తెలుగు ట్రైలర్ విడుదల
Highlights

హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ పేరు వింటేనే టెర్మినేటర్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలు యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.

హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ పేరు వింటేనే టెర్మినేటర్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలు యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు విజయాలను నమోదు చేసుకున్నాయి. తాజాగా టర్మినేటర్ ప్రాంచైజీలో మరో సినిమా "టర్మినేటర్ డార్క్ ఫేట్" తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ తెలుగులో నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. "టర్మినేటర్ డార్క్ ఫేట్ " ఇంగ్లీష్ , హిందీ,లోనే కాకుండా ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలవుతోంది. నవంబర్ 1న సినిమా విడుదల కానుంది.

ఈ ట్రైలర్‌లో ఆర్నాల్డ్ టెర్మినేటర్‌గా మరోసారి కనిపిస్తున్నాడు. లిండా హామిల్టన్ టెర్మినేటర్లను వేటాడుతూ ఉన్న సిన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరన్, డేవిడ్ ఎల్లిసన్ సంయుక్తంగా నిర్మించారు. టెర్మినేటర్ 2 జడ్జ్‌మెంట్ డేకు సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టిమ్ మిల్లర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.Next Story