నవ్వుతూ, ప్రశాంతంగా చూడొచ్చు "తెనాలి రామకృష్ణ బీఏబీఎల్" ట్విట్టర్ రివ్యూ

Tenali Ramakrishna BA.BL
x
Tenali Ramakrishna BA.BL
Highlights

ప్రస్థానం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్‌ప్రెక్స్ తో బంపర్ హిట్ కొట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సందీప్ కిషన్...

ప్రస్థానం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్‌ప్రెక్స్ తో బంపర్ హిట్ కొట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సందీప్ కిషన్ సంపాదించాడు. గత చిత్రం హార్రర్ జోనర్‌లో వచ్చిన నిను వీడని నీడను నేనే అంటూ ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఆ చిత్రం పర్వాలేదు అనిపించినా బాక్సాఫిస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. చాలా కాలంగా సందీప్ కిషన్‌కు సరైన హిట్ దక్కలేదు.

తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న చిత్రమిది. హన్సికా మోత్వాని హీరోయిన్‌గా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ లో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పందెంకోడి2 ఫేమ్ తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్"లో కీలక పాత్ర పోషించారు. కమెడియన్లు వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు ముఖ్య తారాగనం ఈ చిత్రంలో ఉన్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.

సినిమా మంచి సక్సెస్ అవుతుందన్న ధీమాతో గురువారం రాత్రే హైదరాబాద్, తెనాలి, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. విడుదలైన అన్ని చోట్లు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో చిత్రంపై అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

కడుపుబ్బా నవ్వించే చిత్రమని, నవ్వుతూ, హాయిగా చూడదగిన సినిమా అంటున్నారు. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారని చెబుతున్నారు. సందీప్ కిషన్ మరోసారి తన నటనతో సినిమాను నడిపించారని ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో జరిగిన కొన్ని పొలిటికల్‌ సీన్లు ఈ సినిమాలో వాడేశాంట. ముఖ్యంగా కేఏ పాల్ పాడిన పాట సైలీలో నటి సత్య కృష్ణన్ పండించిన హాస్యం సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు అంటున్నారు. ద్వితీయ భాగంలో ట్వీస్టులు కూడా సినిమాకి హైలైట్ గా నిలిచాయని ట్వీట్ చేస్తున్నారు.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ కొంత నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. రొటీన్ కామెడీ, కొన్ని చోట్ల బోరింగ్ సిన్స్. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలోనూ అదరగొట్టారట.అందరూ బాగానే నటించినా.. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మూవీలో కొత్తగా ఏమీ చూపించలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories