మళ్లీ రెహ్మాన్ ను పిలుస్తున్న తెలుగు నిర్మాతలు

Telugu producers calling Rehman again
x

మళ్లీ రెహ్మాన్ ను పిలుస్తున్న తెలుగు నిర్మాతలు

Highlights

Tollywood Producers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులు ఇద్దరే ఇద్దరు. దేవి శ్రీ ప్రసాద్ మరియు ఏ స్టార్ హీరో సినిమా కైనా ప్యాన్ ఇండియన్ సినిమాకైనా వీరిద్దరిలో ఎవరో ఒకరే సంగీతాన్ని అందిస్తున్నారు.

Tollywood Producers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులు ఇద్దరే ఇద్దరు. దేవి శ్రీ ప్రసాద్ మరియు ఏ స్టార్ హీరో సినిమా కైనా ప్యాన్ ఇండియన్ సినిమాకైనా వీరిద్దరిలో ఎవరో ఒకరే సంగీతాన్ని అందిస్తున్నారు. వీరు సంగీతాన్ని అందించిన దాదాపు అన్ని పాటలు చార్ట్ బస్టర్లు గా అవుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు ప్రతి సినిమాకి వెరైటీని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రస్తుతం రెహమాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న నెక్స్ట్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించడానికి ఏ ఆర్ రెహమాన్ ను సంప్రదంచనున్నారట.

ఈ నేపథ్యంలోనే రెహ్మాన్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ను హీరోగా పెట్టి డైరెక్టర్ పూరిజగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ "జనగణమన" సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా సంగీత దర్శకుడిగా రెహ్మాన్ నే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహారెడ్డి" సినిమా కి కూడా ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాల్సింది కానీ ఆఖరి నిమిషంలో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. అయినా సరే ఇప్పుడు మళ్లీ వరుస తెలుగు ఆఫర్లు అందుకుంటున్నారు ఏ ఆర్ రెహమాన్.

Show Full Article
Print Article
Next Story
More Stories