కనుమరుగవుతున్న తెలుగు కామెడీ కాంబినేషన్స్..

telugu comedians
x
telugu comedians
Highlights

నవ్వించడం అనేది అంతా ఈజీ మ్యాటర్ కాదు.. వెండితెరపై మళ్ళీ మళ్ళీ కనిపించి ప్రేక్షకులను నవ్వించడం అనేది మరింత కష్టం.. కానీ కొందరు కమెడియన్స్ అవే పాత్రలో...

నవ్వించడం అనేది అంతా ఈజీ మ్యాటర్ కాదు.. వెండితెరపై మళ్ళీ మళ్ళీ కనిపించి ప్రేక్షకులను నవ్వించడం అనేది మరింత కష్టం.. కానీ కొందరు కమెడియన్స్ అవే పాత్రలో కనిపించిన ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా నవ్వించి కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను తమదైన నటనతో మెప్పించారు. కానీ ఇప్పుడు కనుమరుగయ్యారు. వారి కోసం ఒక్కసారి మనం తెలుసుకుందాం..

1. కోట శ్రీనివాస్ రావు : బాబు మోహన్

తెలుగు సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టు అయిన కాంబినేషన్ వీరిది.. మామగారు సినిమాలో వీరి కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డాయి.ఆ తర్వాత వీరు సినిమాల్లో ఉంటే చాలు అని దర్శక నిర్మాతలు భావించేవారు.. అలా తెరపై ఎన్ని సార్లు కనిపించిన కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టించకూడా నవ్వించారు వీరిద్దరూ.. ఆ తర్వాత ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్లారు. కోట సినిమాలు చేస్తూనే ఉన్నారు కానీ బాబు మోహన్ మాత్రం పూర్తిగా రాజకీయాలకే అంకితం అయ్యారు.

2 . బ్రహ్మానందం : గుండు హనుమంతరావు

ఇద్దరు ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహ నా పెళ్ళంట వీరికి మొదటి సినిమా.. ఆ తర్వాత ఇద్దరు కలిసి నటించారు. ముఖ్యంగా ఎక్కువగా పూజారి గెటప్ లోనే వీరు తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. కానీ బ్రహ్మానందం కి స్టార్ డం రాగా గుండు హనుమంతరావు మాత్రం సపోర్ట్ క్యారెక్టర్ గా కెరియర్ ని నెట్టుకొచ్చారు. 30 ఏళ్ల వీరి సినీ ప్రపంచంలో బావా బావా అని పిలుచుకునే సానిహిత్యం వీరిద్దరి మధ్య ఉంది.

3. అలీ : వేణుమాధవ్

ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ గా మరొకరు మిమిక్రి ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వేణు మాధవ్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది సీనియర్ కమెడియన్స్ తో అలీ నటించాడు. కానీ అలీ వేణుమాధవ్ కాంబినేషన్ మాత్రం బాగా హిట్టు అయింది. ఇలా చాలా సినిమాల్లో కామెడి పాత్రల్లో కలిసి నటించి మెప్పించారు. ఇద్దరు కలిసి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హంగామా అనే సినిమాలో హీరోలుగా కలిసి నటించారు.

4. మల్లికార్జున రావు : కృష్ణా భగవాన్

ఇద్దరు దర్శకుడు సీనియర్ వంశీ సినిమాల్లో ఎక్కువగా కనిపించి పాపులర్ అయ్యారు. కృష్ణా భగవాన్ పంచ్ టైమింగ్ కి మల్లికార్జున రావు అయోమయం అయ్యే సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించారు. స్వతహాగా కృష్ణా భగవాన్ రైటర్ కావడంతో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలుకి కామెడి బాగా వర్కౌట్ అయ్యేది.

ఇలాంటి కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే కమెడియన్స్ అర కోర సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు కానీ ఇలా వీరిలా దశాబ్దాల పాటు తమ ప్రయాణాన్ని కొనసాగించాలేకపోతున్నారు. వాస్తవానికి చెప్పుకోవాలంటే అప్పటికంటే ఇప్పుడే హాస్యనటులు ఎక్కువగా ఉన్నారు. అలాంటి కాంబినేషన్లు మళ్ళీ తెలుగు తెరపై రాజ్యం ఏలాలని కోరుకుందాం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories