OTT Movies 2021: మంచి సినిమాలేమీ ఓటీటీలో రావని ఫిక్స్ అయిన ప్రేక్షకులు

Telugu Cinema Audience Thinks that there is no Good Movies Releasing in OTT Platforms
x

థియేటర్స్ అండ్ ఓటిటి(ఫైల్ ఫోటో)

Highlights

* అలాంటి సినిమాలే ఓటీటీలలో విడుదలవుతాయని అపోహ పడుతున్న ప్రేక్షకులు

OTT Movies 2021: నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా "లవ్ స్టోరీ". చాలా కాలం తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద హీరో సినిమా ఇది. ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించడం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఓటీటీలలో విడుదలైన తెలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో.

లాక్ డౌన్ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలు తమ సినిమాలు డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదలైన సినిమాలు అయిన వెంకటేష్ "నారప్ప", నాని "టక్ జగదీష్" యావరేజ్ టాక్ ని మాత్రమే సొంతం చేసుకున్నాయి.

ఇక సినిమా బాలేదు అని అన్నప్పుడే దర్శక నిర్మాతలు సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడతారు అని కొందరు ప్రేక్షకులు ఇప్పటికే అనుకుంటున్నారు. ఇదే గనక కొనసాగితే ఓటీటీలో మంచి సినిమాలు ఏవి విడుదల కావు అనే నమ్మకానికి వచ్చేస్తారు ప్రేక్షకులు. అప్పుడు ఓటీటీలు భారీగా నష్టపోతాయి.

సినిమా నిజంగా బాగుంటే అది కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది అని అనే అపోహ పోవాలంటే ఒక్క హిట్ సినిమా అయినా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి రావాల్సిందే. మరి అలాంటి హిట్ సినిమాని ఎవరు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories