సినీ నటుడు, రచయిత ఉత్తేజ్‌ సతీమణి పద్మ కన్నుమూత

Telugu Actor Uttej Wife Padma Passed Away Due to Cancer Today 13 09 2021
x

సినీ నటుడు, రచయిత ఉత్తేజ్‌ సతీమణి పద్మ కన్నుమూత (ఫైల్ ఫోటో)

Highlights

* బసవతారకం ఆస్పత్రిలో కొంతకాలంగా క్యాన్సర్‌కు చికిత్స

Uttej Wife Padma Passed Away: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇవాళ ఉదయం బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.

ఉత్తేజ్‌ చేసే ప్రతి సేవా కార్యక్రమంలోనూ పద్మ భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ ఫిల్మ్‌ స్కూల్‌ బాధ్యతలను ఆమె నిర్వహించేవారు. ఉత్తేజ్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పద్మ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నాం మహ్రాపస్థానంలో పద్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories