చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లడం లేదు

Raja shekar
x
Rajashekar
Highlights

హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు మూడు పల్టీలు కొట్టింది. కారు బెలూన్స్...

హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు మూడు పల్టీలు కొట్టింది. కారు బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ కు ప్రాణపాయం తప్పింది. అయితే ఈ ప్రమాదంపై హీరో రాజశేఖర్ స్పందించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే.

రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. నుదుటిపై దెబ్బ తగిలింది. దాంతో రక్తం కారింది, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు సంస్కారం మరిచిపోతున్నారని, చనిపోతే చూడడానికి కూడా ఎవరూ వెళ్లడం లేదని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా దయచేసి చూడటానికి వెళ్లండి. లేదా కనీసం ఓ ట్వీట్ అయినా పోస్టు చేయండి. చెప్పాల్సిన సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాను నా క్షేమం కోసం దేవుడిని ప్రారించ వారికి నా నమస్కాం తెలియజేస్తున్నాని రాజశేఖర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories