అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు విడుదలకు హైకోర్టు బ్రేక్‌..

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు విడుదలకు హైకోర్టు బ్రేక్‌..
x
Amma Rajyamlo Kadapa Biddalu
Highlights

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు డిసెంబర్ 12 విడుదలకు ముందు హైకోర్టునుంచి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు డిసెంబర్ 12 విడుదలకు ముందు హైకోర్టునుంచి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిత్ర విడుదలపై దాఖలైన కౌంటర్ పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కాగా వీటిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. అయితే ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిపికేట్‌ రాలేదని, బోర్డు సూచనల పలు చానళ్ల లోగోను తీశామని కోర్టుకు చిత్ర బృందం తెలిపింది. అయితే చిత్రంలో కొన్ని వర్గాలను కించపరిచేలా ఉన్నాయని, విడుదలైతే శాంతి భద్రతల సమస్య నెలకొనే అవకాశం ఉందని, చిత్రం విడుదల నిలిపివేయాలని ఎగ్జామినేషన్‌ కమిటీ హైకోర్టులో పేర్కొంది.

కాగా.. రివ్యూ కమిటీ ఇప్పటికే ఈ సినిమా యూనిట్‌కు షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చిందని తెలంగాణ అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ (టీఎఎస్) కోర్టుకు వెల్లడించింది. హైకోర్టు మాత్రం ఈ సినిమాపై ప్రస్తుత పరిస్థితి గురించి తెలంగాణ అడిషనల్ సోలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించింది.రివ్యూ కమిటీ సినిమాను చూడలేదని తెలిపింది. దీంతో సినిమాను చూసి అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. రివ్యూ కమిటీ పరిధిలో సినిమా రిలీజ్ విషయం ఉండడంతో హైకోర్టు జోక్యం చేసుకోలేమని తెలిపింది. సెన్సార్ బోర్డు కూడా రివ్యూ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలిగించినట్లు కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. మ్యూట్‌లో ఏ సన్నివేశాలు ఉంచలేదని, వాటిని తొలిగించామని చిత్ర యూనిట్‌ హైకోర్టుకు విన్నవించుకుంది. అన్ని సక్రమంగా ఉంటే అనుమతి ఇవ్వాలని రివ్యూ కమిటీకి హైకోర్డు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత‎ నట్టి కుమార్‌ మాట్లాడుతూ.. అనుకున్న ప్రకారమే చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. గతంలో చిత్ర టైటిట్ విషయంలో ఏపీ నుంచి అభ్యంతరం వ్యక్తమైతే టైటిల్ మార్చారు. ఈ క్రమంలో చిత్రం విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయంపై రాంగోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories