దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్!

దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్!
x
Highlights

దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. RRR మూవీ టీజర్ లో కొమురం భీం పాత్రకు ముస్లింలు ధరించే టోపీ పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. RRR మూవీ టీజర్ లో కొమురం భీం పాత్రకు ముస్లింలు ధరించే టోపీ పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేకుంటే RRR చిత్రం రిలీజ్ అయ్యే థియోటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కొమురం భీం నిజమైన చరిత్ర తెలుసుకుని సినిమా తీయాలని రాజమౌళికి సోయం బాపు రావు హితవు పలికారు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమాని వచ్చే ఏడాది జనవరిలో రిలిజ‌్ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories