"ఆది పురుష్" కోసం వెనక్కి తగ్గిన "అద్బుతం" హీరో

Teja Sajja postponed his movie teaser for Prabhas movie teaser
x

"ఆది పురుష్" కోసం వెనక్కి తగ్గిన "అద్బుతం" హీరో

Highlights

"ఆది పురుష్" కోసం వెనక్కి తగ్గిన "అద్బుతం" హీరో

Teja Sajja: ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం యువహీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న "హనుమ్యాన్" సినిమా టీజర్ కూడా అదే రోజున విడుదల కి సిద్ధమైంది.

కానీ తాజా సమాచారం ప్రకారం "ఆది పురుష్" టీజర్ వచ్చిన తరువాతే హనుమాన్ టీజర్ కోసం తమ సినిమా టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. "ఆది పురుష్" టీజర్ విడుదలైన తరువాతే తమ టీజర్ విడుదల కోసం కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుండగా రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories