Chitram 1.1: సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..ప్రకటించిన తేజ

చిత్రం 1.1(ఫోటో ట్విట్టర్ )
Chitram 1.1: 21 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ సీక్వెల్ ప్రకటించిన తేజ, అదే టెక్నికల్ టీమ్. 45 మంది కొత్త నటీనటులతో 'చిత్రం 1.1'
Chitram 1.1: తెలుగులో అప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ డైరెక్టర్ తేజ 'చిత్రం' అనే సంచలన సినిమా తీశారు. తన మొదటి సినిమాలో పూర్తిగా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ.. కేవలం 80 లక్షల్లో పూర్తి చేసి ఘన విజయం సాధించారు. 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలైన 'చిత్రం' యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా కాసుల పంట పండించింది. ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్, రీమా సేన్, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ లాంటి వాళ్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
కాగా, డైరెక్టర్ తేజ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 22న) తన నూతన సినిమాపై ఓ అప్ డేట్ ప్రకటించాడు. అదే చిత్రం సినిమాకు సీక్వెల్. 'చిత్రం 1.1' అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం 45 మంది కొత్తవాళ్లను తీసుకున్నారని సమాచారం. అయితే, నటీనటులు మాత్రమే కొత్తవాళ్లు.. టెక్నికల్ టీమ్ లో మాత్రం కొంత మంది పాతవారే ఉండనున్నారు.
Here comes the blasting announcement that many are waiting for.... wishing Teja garu a happy birthday. Wait for a musical blast from us with this CHITRAM 1.1 pic.twitter.com/ZkxG3GZ7dT
— rp patnaik (@rppatnaik) February 22, 2021
'చిత్రం' సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ చాలా కాలం తరువాత తేజతో జతకట్టారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి పనిచేయడం లేదు. ఆయన స్థానంలో సమీర్ రెడ్డిని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. మొత్తం మీద 21 ఏళ్ల తరవాత మళ్లీ తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయబోతుండడంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే, చిత్రం సినిమాలాగే మరలా ట్రెండ్ సెట్ చేస్తుందో..లేదో..తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే మరి.