logo

చిరంజీవి ల అవ్వకు అని పవన్ కు హెచ్చరిక

చిరంజీవి ల అవ్వకు అని పవన్ కు హెచ్చరిక

ఏపీ లో రాజకీయాల వేడి మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరది అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు లో అధికార పీఠం ఎవరిని వరిస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో పవన్ స్టామినాపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "పవన్ కళ్యాణ్ కు అశేష బలం ఉంది. కానీ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో తలెత్తిన లోపాలను జనసేనలో మళ్ళీ చేయకుండా చూసుకుంటే మంచిది" అని తమ్మారెడ్డి అన్నారు.

"చిరంజీవి మెతకవైఖరి అందరికి తెలిసిందే. కానీ వపన్ మాత్రం మొండి మనిషి. రాజకీయాల్లో ఈ వైఖరి మంచిదేనా?" అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో వ్యూహాలు అనుసరించాలని, జాగ్రత్తలు తీసుకోకపోతే జగన్ చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలకు పవన్ బలైపోతాడని హెచ్చరించారు. "పవన్ సభలకు జనం పోటెత్తుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అంతే జనం వచ్చారు కానీ వాటిని చిరంజీవి ఓట్లుగా మార్చలేకపోయారు. ఈ విషయంలో పవన్ జాగ్రత్త పడకపోతే జనసేన కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అని తమ్మారెడ్డి ఘాటుగా చెప్పుకొచ్చారు.

లైవ్ టీవి

Share it
Top