చిరంజీవిని ఫుల్ గా వాడేస్తున్న యంగ్ హీరోలు

చిరంజీవిని ఫుల్ గా వాడేస్తున్న యంగ్ హీరోలు
x
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ళ తర్వాత కూడా ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సరే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసేలా కలెక్షన్లు దద్దరిల్లిపోతున్నాయి. తాజాగా ఆయన చేసిన సైరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మెగాస్టార్ ఇప్పటివరకు చేసిన సినిమా టైటిల్స్ ని తమిళ హీరోలు బాగానే వాడుకుంటూ తమ సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నారు.

ఇప్పటికే కార్తీ చిరంజీవి రెండు సినిమాల టైటిల్స్ ని వాడుకున్నాడు. అందులో ఒకటి ఖైది మరొకటి దొంగ.. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి నటించిన మరో టైటిల్ తో ఓ అనువాద చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రంగం సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా ఇప్పుడు హీరోగా స్టాలిన్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి అందరివాడు అనేది ఉపశీర్షిక. ఈ సినిమాని పిభ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక అంద‌రివాడు, స్టాలిన్ సినిమాలు చిరంజీవికి మంచి పేరును తీసుకువచ్చాయి. ఇలా అరవ హీరోలు మెగాస్టార్ సినిమాల టైటిళ్లను వాడుకుంటూ ఫుల్ గా మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఫిలిం నగర్ లో చక్కర్లు మొదలయ్యాయి.

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories