Vijay Political Party: తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఇక సినిమాలకు గుడ్ బై

Tamil Hero Vijay Political Entry
x

Vijay Political Party: తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఇక సినిమాలకు గుడ్ బై

Highlights

Vijay Political Party: పొలిటికల్ ఎంట్రీకి సినిమాను బూస్టప్‌లో వాడుకోవాలని ప్లాన్

Vijay Political Party: పొలిటికల్ ఎంట్రీతో తమిళ నటుడు దళపతి విజయ్ ఇక సినిమాలకు గుడ్ చెప్పబోతున్నాడా..? ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్టే ఆయనకు లాస్ట్ సినిమానా..? లాస్ట్ సినిమాను రాజకీయ అరంగేట్రానికి బూస్టప్‌లా వాడుకోబుతున్నాడా..? ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తోనే ఉండబోతుందా లేక పక్కా కమర్షియల్ సినిమానా..? విజయ్ లాస్ట్ సినిమాకు తెలుగు నిర్మాతే ప్రొడ్యూస్ చేస్తుండటంతో కోలీవుడ్‌తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది. ఐతే విజయ్ తన చివరి సినిమాను రీమేక్ చేస్తున్నాడని, బాలయ్య మూవీని అక్కడ రీమేక్ చేబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఇళ‌య దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ‘తమిళ వెట్రి కళ‌గం అంటూ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశాడు. 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేద‌ని అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేద‌ని విజ‌య్ తెలిపాడు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నట్టు ప్రకటించారు. త‌న చివ‌రి సినిమా కూడా దళపతి 69 అని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.

విజయ్ ఇక సినిమాలు చేయకపోవడం అనేది..తమిళ్ ఇండస్ట్రీకి, ఫ్యాన్స్ కు పెద్ద లోటే. రజనీకాంత్, కమల్‌ హాసన్ జనరేషన్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరో విజయ్. ఆయన సినిమాలు కోట్లలో కలెక్షన్స్ రాబడతాయి. కానీ ప్రజా కోసం.. ఇక సినిమాలకు స్వస్తిపలకాలని నిర్ణయించుకున్నాడు.

అలా అనౌన్స్ చేశాడో లేదో విజయ్ తర్వాత ఆ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయ్ సినిమాలు మానేయడం తమిళ సినిమా బిజినెస్‌కు బాగా దెబ్బపడుతుందని.. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ మంచి బిజినెస్‌ను చేస్తాయని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా విజయ్ చివరి సినిమా దళపతి 69పై అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకుంటే విజయ్ లాస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది మన తెలుగు నిర్మాత డి.వి.వి దానయ్య.

ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్‌’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే.. దానయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే విజయ్ లాస్ట్ సినిమా టాలీవుడ్ రీమేక్ అని జోరుగా ప్రచారం సాగుతుంది. అది కూడా బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భగవంత్ కేసరి లైన్ విజయ్‌కు బాగా నచ్చిందని..

అయితే కేవలం ఈ సినిమా కోర్ పాయింట్‌ను మాత్రమే మేకర్స్ తీసుకోబోతున్నారని, దానితో కొత్త కథను రెడీ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు రీమేక్ చేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని విజయ్ చివరి సినిమా పొలిటికల్ సబ్జెక్ట్‌తో కంప్లీట్ ఫ్రెష్ స్టోరీ అని కూడా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రాజకీయాల్లో వస్తున్నానని, ఇక సినిమాలు చేయనని ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు విజయ్. తమిళనాడులో రాజకీయాలు- సినిమాలకు వీడదీయ లేని సంబంధం ఉంది.

కరుణనిధి, ఎంజీఆర్, జయలలిత ఇలా సినిమా బ్యా్గ్రౌండ్‌ నుంచి వచ్చి సీఎం పదవులు అధిరోహించిన వారే.. విజయ్ కాంత్, కమల్‌హాసన్ లాంటి వారు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. ఊరించి ఊరించి.. రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. ఎన్నో ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలతో సేవ చేస్తున్న విజయ్.. ఇక పూర్తిస్థాయి పొలిటికల్ లీడర్‌గా అవతావం ఏత్తేందుకు రెడీ అయిపోయారు. పార్టీ పేరు ప్రకటించి..గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ ప్లేస్ కనిపిస్తోంది. మొన్నటి వరకు తమిళనాట.. కరుణానిధి, జయలలిత హోరాహోరీగా తలపడ్డారు. ఎవరికి ఎవరు తీసి పోని విధంగా.. అక్కడ ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత.. స్టాలిన్ రూపంలో డీఎంకేకు గట్టి వారసత్వమే దొరికింది. కానీ అన్నాడీఎంకే గ్రూప్ తగాదాలతో సతమతం అవుతోంది. అందులో ప్రజాధారణ ఉన్న నేతలే కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. అన్నాడీఎంకే కేడర్‌ మొత్తం.. విజయ్ వైపు మళ్లీ అవకాశం ఉంది. డీఎంకే ప్రభుత్వ విధానాలు నచ్చనివారు కూడా విజయ్ పార్టీని ప్రత్యామ్నాయంగా భావించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో.. సరైన గ్రౌండ్ వర్క్‌తో, విధివిధానాలతో జనాల్లోకి వెళితే.. విజయ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories