Tamannaah:కుంభమేళాలో ఓదెల2 టీజర్ రిలీజ్.. నాగ సాధువుగా పవర్‌ఫుల్ లుక్‌లో తమన్నా..

Tamannaahs Odela 2 Movie Teaser Release At Kumbh Mela
x

కుంభమేళాలో ఓదెల2 టీజర్ రిలీజ్.. నాగ సాధువుగా పవర్‌ఫుల్ లుక్‌లో తమన్నా..

Highlights

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు.

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు. కుంభమేళాలో లాంచ్ చేసిన మొదటి టీజర్ కూడా ఇదే కావడం గమనార్హం. కరోనా సమయంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా ఓదెల 2 రూపొందుతుంది. ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

టీజర్ చూస్తుంటే.. ఓదెల గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి నాగ సాధువు అయిన తమన్నా ఎలా రక్షిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే శివ శక్తి గీతం గుస్ బంప్స్ తెప్పించేలా ఉండగా.. తమన్నా నాగ సాధువు లుక్, ఆమె యాక్షన్ సన్నివేశాలు టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి.

మొదటగా ఢమురకం, సైకిల్ బెల్ సౌండ్స్ శివలింగం, నంది విజువల్స్‌తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత లేడీ అఘోరి పాత్రలో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. మొదటి పార్ట్‌లో హత్య చేయబడిన వశిష్ట ఎన్ సింహ ఆత్మ దెయ్యంగా మారిన కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. మధ్యమధ్యలో హెబ్బా పటేల్‌తో పాటు మొదటి పార్ట్ లోని కొన్ని సీన్స్‌ని ఇంటర్ లింక్ చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేతబడులు చేసే వ్యక్తి పాత్రలో కనిపించగా.. మురళి శర్మ ముల్లా సాబ్ పాత్రలో కనిపించారు. చివరిలో నీరు, నిప్పు, గాలి అన్నీ నాకు దాసోహమే అంటూ డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది.

అయితే ఈ టీజర్‌లోని కొన్ని సీన్స్, పాత్రలని అరుంధతి సినిమా గుర్తుచేస్తోంది. ముఖ్యంగా విలన్‌ని చంపిన తర్వాత ఆత్మ ప్రేతాత్మగా మారడం, మురళి శర్మ ముల్లా క్యారెక్టర్ ఇవన్నీ కూడా కొంతమేర చూసినట్టు అనిపిస్తుంది. కానీ విజువల్స్, స్క్రీన్ ప్లే మాత్రం సంపత్ నంది అదరగొట్టారు. తమన్నా లేడీ అఘోరి పాత్రలో ఆకట్టుకున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వశిష్ట ఎన్ సింహా బాగా అలరించారు. బి. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇక మొత్తానికి ఓదెల 2 టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.

2022 లో కరోనా సమయంలో ఓదెల రైల్వే స్టేషన్ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఓదెల2 త్వరలో మన ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories