Tamannaah: విజయ్‌‌ వర్మతో తమన్నా బ్రేకప్..?

Tamannaah Shared An Interesting Quote On Her Instagram Story
x

విజయ్‌‌ వర్మతో తమన్నా బ్రేకప్..?

Highlights

సినిమాల పరంగా, కెరీర్ పరంగా దూసుకుపోతున్న తమన్నా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా ప్రకటించారు.

Tamannaah: సినీ ప్రపంచం ఓ రంగుల కల. సెలబ్రిటీల లగ్జరీ జీవితాలను చూసి చాలా మంది వారిని అనుసరిస్తూ ఉంటారు. వారిలా ఉండాలి అనుకుంటారు. కానీ మనం అనుకున్నంత ఈజీగా వారి జీవితాలు ఉండవు. వారి జీవితానికి సంబంధించి ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతాయి. ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్ ప్రేమకు సంబంధించి కానీ బాధతో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు వెంటనే వారు బ్రేకప్ అయ్యారనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా తమన్నా కూడా వార్తల్లో నిలిచారు. ఆమె పెట్టిన ఓ చిన్న పోస్ట్‌ వల్ల తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే పుకార్లకు తెరతీసింది. ఇంతకీ తమన్నా పెట్టిన పోస్ట్ ఏంటో చూద్దాం.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్‌లు చాలా కామన్ అయిపోయాయి. కొందరు కొంత కాలం రిలేషన్ షిప్‌లో ఉండి తర్వాత విడిపోతుంటే.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకున్న అతికొద్ది కాలంలోనే విడిపోతున్నారు. అలా విడిపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే సినిమాల పరంగా, కెరీర్ పరంగా దూసుకుపోతున్న తమన్నా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా ప్రకటించారు.

అంతేకాదు ఇటీవల పలు ఈవెంట్స్, పార్టీలతో జంటగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు కూడా పెడుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోతున్నారని.. తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తమన్నా పెట్టిన పోస్టుతో వీరు బ్రేకప్ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమించడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం.. ఆసక్తికరంగా ఉండడమే. వేరే వాళ్లు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా చూడాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును తమన్నా తన ఇన్‌స్టాలో పెట్టారు.

ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో తమన్నా విజయ్ వర్మతో విడిపోయిందా..? అంటూ రూమర్స్ మొదలయ్యాయి. మరి దీని పై తమన్నా ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories