వరుణ్ తేజ్ తో డాన్స్ చేయనున్న స్టార్ బ్యూటీ

Tamannaah Item Song in Varun Tejs Movie Ghani | Tollywood News Online
x

వరుణ్ తేజ్ తో డాన్స్ చేయనున్న స్టార్ బ్యూటీ

Highlights

మెగా హీరోతో స్టెప్పులేయ్యనున్న తమన్నా

Varun Tej-Tamannaah: ఈ మధ్యనే "గద్దలకొండగణేష్", "ఎఫ్ 2" వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు "గని" సినిమాతో బిజీగా ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగులో కనిపించబోతోంది.

ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. పోస్టర్ లో తన అందమైన లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తమన్నా ఈ సినిమాలో "కొడితే" అనే ఒక ఐటమ్ సాంగ్ లో వరుణ్ తేజ్ తో కలిసి స్టెప్పులు వేయనుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఉదయం 11:08 నిమిషాలకు ఈ పాట వీడియో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై సిద్దు మరియు అల్లు బాబి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మార్చి 18న విడుదలకు సిద్ధం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories