Seetimaarr: ఆ యాస.. భలే ఉందంటున్న మిల్కీబ్యూటీ

తమన్నా, సంపత్ నంది (ఫొటో ఇన్‌స్టాగ్రాం)
Seetimaarr: మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు.
Seetimaarr: మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో చాలా ప్రాజెక్ట్‌లున్నాయి. తెలుగులోనే దాదాపు నాలుగైదు సినిమాలున్నాయి. నితిన్ హీరోగా రాబోతోన్న హిందీ మూవీ 'అంధాదున్' రీమేక్, కన్నడ మూవీ 'లవ్ మాక్ టెయిల్' రీమేక్ అయిన 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్ 3', 'సీటీమార్'.. ఇలా పలు చిత్రాలతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా గడుపుతోంది.
అయితే ముందుగా 'సీటీమార్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు హ్యాపీ డేస్ బ్యూటీ. ఈ మధ్యే రిలీజైన జ్వాలా రెడ్డి పాటతో అదరగొడుతోంది తమన్నా. మాస్ సాంగ్‌కు గోపీచంద్, తమన్నా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు.
కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మరో విషయం తెలిసింది. తమన్నా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారంట. అందులోనూ తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించిందని పేర్కొన్నారు. దర్శకుడు సంపత్ నంది దగ్గరుండి ఆమెతో తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పించారంట. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. తెలంగాణ జట్టుకు కోచ్‌గా తమన్నా, ఆంధ్ర జట్టుకు కోచ్‌గా గోపీచంద్ నటించారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT