Tamannaah: నన్ను అలా పిలిస్తే ఎలాంటి సమస్య లేదు కానీ.. తమన్నా కీలక వ్యాఖ్యలు

Tamannaah Bhatia No Issue Being Called Milky Beauty But Actress Opens Up on Her Real Focus
x

Tamannaah: నన్ను అలా పిలిస్తే ఎలాంటి సమస్య లేదు కానీ.. తమన్నా కీలక వ్యాఖ్యలు

Highlights

Tamannaah: 2005లో వచ్చిన శ్రీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది అందాల తార తమన్నా.

Tamannaah: 2005లో వచ్చిన శ్రీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది అందాల తార తమన్నా. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ చెరగని ఫాలోయింగ్‌, అవకాశాలతో దూసుకుపోతోందీ చిన్నది. ఇక తమన్న అనగానే మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌ వినిపిస్తుంది. అయితే తనకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదని గతంలో పలు సార్లు తమన్నా తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే అంశంపై మరోసారి స్పందించింది తమన్న.

ప్రస్తుతం తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన తమన్న స్పెషల్‌ సాంగ్స్, వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్' చిత్రం ఆమె టాలీవుడ్‌లో చేసిన చివరి సినిమా. ఇటీవల 'స్త్రీ 2'లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది.

ప్రస్తుతం ఓదెల2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న తమన్నా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్టు ఆమెను ప్రశ్నిస్తూ.. “ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తిని ఎలా చూపించగలిగారు?” అని అడిగాడు. దీనికి తమన్నా బదులిస్తూ.. 'నన్ను మిల్కీ బ్యూటీ అని పిలవడం నాకు ఇబ్బందిగా అనిపించదు. కానీ, నేను చేస్తున్న పాత్రలు, నటన మీదే దృష్టి పెట్టాలి. ‘ఓదెల్ 2’లో నేను పోషించిన శివశక్తి పాత్రలో ఆధ్యాత్మికత ఉంది. అలాంటి పాత్రల ద్వారా నా సామర్థ్యం, వైవిధ్యం చూపించడమే నాకు ముఖ్యం” అని చెప్పింది.

లుక్స్‌ కంటే నటనపై ఫోకస్‌ పెట్టాలను కోరుకుంటున్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది. అందం ఒక విషయం.. కానీ నటిగా ఎదగాలంటే పాత్రలతో చక్కటి గుర్తింపు రావాలి అని చెప్పకనే చెప్పిందీ చిన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories