11th Hour Released: ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న తమన్నా వెబ్ సిరీస్

11th Hour Web Series Released
x

'11th అవర్‌'

Highlights

11th Hour Released: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలు, వరుస షోలతో దుసూకుపోతున్న విషయం తెలిసిందే.

11th Hour Released: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలు, వరుస షోలతో దుసూకుపోతున్న విషయం తెలిసిందే. కాక్ర్, నాంది, గాలిసంపత్ , జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి జోరు మీదవుంది. ఇటీవలే టాలీవుడ్ అగ్రకథానాయక సమంత‌తో సామ్ జామ్ షో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆ షో విజయవంతం కావడంతో రానా హోస్ట్‌గా చేసిన నెంబర్ వన్ యారీ మూడో సిజన్ డిజిటల్ రైట్స్ కోనుగోలు చేసింది.

ఇక తాజాగా ఆహా వెబ్ సిరీస్‌లో రూపొందించడంలో స్పీడ్ పెంచింది. ఆహా టీమ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన '11th అవర్‌' అనే వెబ్ సిరీస్ ఇవాళ్టి నుంచి స్ట్రీమ్ అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడంతో ఈ సిరీస్ ఆసక్తి నెలకొంది. తమన్నా మొదటి సారి వెబ్ సిరీస్ లో నటించింది.

ఇటీవలే విడుదల అయినా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సిరీస్‌లో మొత్తం ఏనిమిది ఎపిసోడ్స్ వచ్చాయి. ఇది 8th అవర్ అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. ఈ సిరీస్ లో తమన్నా కార్పొరేట్ కంపెనీని ని నడిపే అరాత్రికా రెడ్డి అనే అమ్మాయిగా కనిపిస్తోంది. కథ మొత్తం తమన్నా భాటియా పాత్ర ఆరాత్రికా రెడ్డి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తండ్రి వ్యాపారం చేపట్టడానికి కారణం ఆమె తల్లి. దేశంలో స్థిరమైన శక్తిని ఉచితంగా అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది, కానీ ఆమె లక్ష్యాన్ని సాధించడానికి ఆమె ప్రయాణం అంత సులభం కాదు. ఇది పురుషుల ప్రపంచంలో తన పోరాటాలతో పోరాడుతున్న ఒక మహిళ యొక్క కథ.

కుటుంబ సభ్యులు - స్నేహితులు - శత్రువులు ఆమె ఆ కంపెనీని నిర్వహించలేదనే భావన ఉంటుంది. అయితే ఆదిత్య గ్రూప్ కంపెనీ బాధ్యతలు తీసుకుని తమన్నా దానిని వృద్ధిలోకి తీసుకొస్తుంది. పురుషాధిక్యత ఉన్న రంగంలోకి దిగిన యువతి.. ఆ పోటీని శత్రువులను తట్టుకొని ఎలా పోరాడి నిలబడింది అనేది ఈ కథ. 'రాబందుల మధ్యలో రెడ్‌ రైడింగ్‌ హుడ్‌కు సాయం చేసేది ఎవరూ..?' అంటూ సాగే సంభాషణ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. "చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చేయాల్సి వస్తుంది" అని డైలాగ్ '11త్ అవర్' నేపథ్యాన్ని తెలియజేస్తోంది.

ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతుంటుంది. ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూటుంది. క్లైమాక్స్ లో తమన్నా నటన సిరీస్ లో పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్‌కు ప్రదీప్ ఉప్పలపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ , రోషిణి ప్రకాష్ , జయప్రకాష్ , శత్రు , మధుసూదన్ రావు , పవిత్ర లోకేష్, అనిరుధ్, బాలాజీ , శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ , ప్రియా బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories