దేవిశ్రీప్రసాద్ తో బంధం గురించి చాటిచెప్పిన తమన్

Taman Talks About Her Relationship With Devisriprasad
x

దేవిశ్రీప్రసాద్ తో బంధం గురించి చాటిచెప్పిన తమన్

Highlights

Thaman: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో వరుస సూపర్ హిట్ లతో ముందుకు దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరే ఇద్దరు.

Taman: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో వరుస సూపర్ హిట్ లతో ముందుకు దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు ఎస్.ఎస్.తమన్ కాగా మరొకరు దేవిశ్రీప్రసాద్. దాదాపు ప్రతీ పాటతోనూ చార్ట్ బస్టర్ లు అందిస్తూ తమ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ సంగీతదర్శకులు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారని ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఆ పుకార్లను నిజం లేదని వీరు తెలియజేస్తూనే ఉంటారు.

ఈ మధ్యనే వీళ్లిద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన "ఎవరు మీరు కోటీశ్వరుడు" షో లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న "గని" సినిమా లో నుండి రోమియో జూలియట్ పాటను ఈ మధ్యనే లాంచ్ చేశారు. అభిమానులందరూ దేవిశ్రీప్రసాద్ నీ రాక్ స్టార్ అని పిలుస్తారు అనేది తెలిసిందే. కానీ పాట విడుదల వేడుకలో మాట్లాడుతూ వరుణ్ తేజ్ థమన్ నీ రాక్ స్టార్ అని అన్నారు. అప్పుడు వెంటనే థమన్ రాక్ స్టార్ అంటే దేవిశ్రీప్రసాద్ మాత్రమేనని చెప్పారు. దీంతో వాళ్ల మధ్య ఎటువంటి వైరం లేదని ఇద్దరూ మంచి స్నేహితులు అని చెప్పకనే చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories