logo

అలాంటి పాత్రలకు రెడి అంటున్న టబు

అలాంటి పాత్రలకు రెడి అంటున్న టబు
Highlights

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న టబు గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి...

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న టబు గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన 'పాండురంగడు' సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు టబు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ లో టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ మధ్యనే 'అంధాదున్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టబు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న 'దే దే ప్యార్ దే' సినిమాలో కూడా నటిస్తోంది. 'అంధాదున్' లో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపేసిన యువతి పాత్రలో కనిపించింది టబు.

రేపు విడుదల కాబోతున్న 'దే దే ప్యార్ దే' సినిమాలో గర్ల్ ఫ్రెండ్ మాయలో పడ్డ మాజీ భర్తను రక్షించుకునే భార్య పాత్ర చేస్తోంది టబు. ఇలాంటి టిపికల్ రోల్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుందని, ఇకముందు కూడా అలాంటి ఊహించని పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తాను అని, భాషతో సంబంధం లేకుండా కథ, పాత్ర నచ్చితే ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది టబు. ఇదిలా ఉండగా, 'దే దే ప్యార్ దే' సినిమా లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top