
Taapsee Pannu : తెలుగు సినిమాల్లో బ్రా ధరించాలని ఒత్తిడి చేసేవారు.. బెడ్ రూమ్ సీన్లు ఒకేనా అంటూ కౌంటర్
టాలీవుడ్లో తన అనుభవాలపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు.. గ్లామర్ సీన్లు, డ్రెస్సింగ్‌పై ఒత్తిళ్లను బహిర్గతం చేసిన హీరోయిన్
Taapsee Pannu Sparks Controversy: దక్షిణాది వెండితెరపై ‘ఝుమ్మంది నాదం’ అంటూ అడుగుపెట్టి, ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో మొగ్గలై విరిసిన తాప్సీ పన్ను.. మరోసారి టాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఇక్కడి అవకాశాల కోసమే పరితపించిన ఈ అమ్మడు, ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయ్యాక దక్షిణ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన కొత్త సినిమా ‘అస్సీ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. షూటింగ్ సెట్స్‌లో గ్లామర్ సీన్లు చేసేటప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపించాలని, అందుకోసం ప్యాడెడ్ బ్రా ధరించాలని సౌత్ మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆమె ఆరోపించింది.
వందలాది మంది ఉన్న షూటింగ్ స్పాట్లో అటువంటి విషయాలు చెప్పడం నాకు చాలా అసౌకర్యంగా ఉండేది. ముఖ్యంగా దక్షిణాది, భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్ల అందాల ప్రదర్శన, నాభి (బొడ్డు) సీన్లపైనే మేకర్స్ ఎక్కువ శ్రద్ధ పెడతారు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.గతంలోనూ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన నాభి సీన్లపై కామెంట్స్ చేసి వివాదం సృష్టించిన తాప్సీ, ఇప్పుడు మరోసారి పాత పగను వెళ్లగక్కుతున్నట్లు కనిపిస్తోంది.
తాప్సీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఒక రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. అమ్మడు గతం మర్చిపోయినట్లుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.సౌత్‌లో గ్లామర్ సీన్లు అంటే ఇబ్బంది పడే తాప్సీ, బాలీవుడ్ సినిమాల్లో విచ్చలవిడిగా బెడ్ రూమ్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు ఎలా చేస్తోంది? అక్కడ పద్ధతులు అడ్డరావా? అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.తెలుగు పరిశ్రమ నీకు లైఫ్ ఇచ్చింది, ఇక్కడ గుర్తింపు వచ్చింది కాబట్టే ఈరోజు బాలీవుడ్లో ఉన్నావని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ అనేది ఒక భాగమని, అది తెలిసి కూడా ఇప్పుడు బాధితురాలిలా నటించడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు.
సినీ పరిశ్రమ ఏదైనా నటిగా తాప్సీకి తొలి మెట్టు వేసింది దక్షిణాది చిత్రాలే. ఇక్కడి కమర్షియల్ సినిమాల వల్లే ఆమెకు మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాలీవుడ్లో మంచి పాత్రలు దక్కగానే, తన కెరీర్‌ను నిలబెట్టిన పరిశ్రమపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఆమె వ్యక్తిత్వానికే మాయని మచ్చ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాప్సీ చేసిన ఈ 'ప్యాడెడ్' వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ యుద్ధానికే దారితీశాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




