సైరా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడంటే ?

syeraa
x
syeraa
Highlights

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఇటు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా నరసింహ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరా నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. అమితాబ్ బచ్చన్ , సుధీప్, విజయ సేతుపతి, రవిశంకర్, తమన్నా ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాని తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది...

అయితే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఇటు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6న డిజిటల్ మీడియాలో విడుదల కానుంది. తెలుగుతో పాటు మిగతా బాషలో కూడా అదే రోజు విడుదల అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ తో కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories