ఆ సీన్ 'సైరా'కి హైలైట్ ... రోమాలు నిక్కబొడుచుకునేలా...

ఆ సీన్ సైరాకి హైలైట్ ... రోమాలు నిక్కబొడుచుకునేలా...
x
Highlights

ఎవరి దగ్గర చూసిన ఇప్పుడు సైరా డిస్కషన్ నడుస్తుంది. మెగాస్టార్ పదేళ్ళ డ్రీంగా ఈ సినిమా తెరకెక్కింది. చాలా ప్రతిష్టాత్మకంగా చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్...

ఎవరి దగ్గర చూసిన ఇప్పుడు సైరా డిస్కషన్ నడుస్తుంది. మెగాస్టార్ పదేళ్ళ డ్రీంగా ఈ సినిమా తెరకెక్కింది. చాలా ప్రతిష్టాత్మకంగా చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్, ట్రైలర్ , సినిమా మేకింగ్ వీడియోస్ సినిమాపైన భారీ అంచనాలును క్రియేట్ చేసాయి.

అయితే సినిమాకి హైలైట్ గా నిలిచే ఓ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా విడుదల చేసింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశం సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. మొత్తం ఈ సన్నివేశానికి గాను 2000 మందితో, 35 రాత్రుల పాటు కస్టపడి గ్రాండ్ గా షూట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సన్నివేశాలను చూస్తున్నా ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చెబుతున్నారు.

చిరంజీవితో పాటు పెద్ద పెద్ద తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ , సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క,తమన్నా , జగపతి బాబు మొదలగువారు అతిధి పాత్రలో మేరవనున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories