సైరా 24 రోజుల కలెక్షన్స్...

సైరా 24 రోజుల కలెక్షన్స్...
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి.. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. గాంధీ జయంతి...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి.. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమాకి ఫస్ట్ షో నుండే మంచి టాక్ వచ్చింది. దీనితో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోయింది. మొత్తం తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

తెలుగులో బాగానే కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మిగిలిన భాషల్లో మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 105 కోట్లను రాబట్టిందని సమాచారం.. ఇక ప్రపంచవ్యాప్తంగా 187.25 కోట్ల బిజినెస్ జరిగితే గత 24 రోజుల్లో అన్ని చోట్లలో ఈ సినిమా 141.16 కోట్లను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.188 కోట్లు రావాల్సి ఉంది.. గ్రాస్ లెక్కల్ని పరిశీలిస్తే.. రూ.232.11 కోట్లు రాబట్టిందని టాక్.. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలును పూర్తి చేశారు. త్వరలో సినిమా పట్టాలెక్కనుంది...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories